
సన్నాసుల సన్నాయి నొక్కులకు భయపడ..
● ఓట్ల రాజకీయం కాదు..అభివృద్ధి ముఖ్యం ● ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు
దుబ్బాక : సన్నాసుల సన్నాయి నొక్కులకు భయపడనని.. చట్టం తెలిసిన వాడిని న్యాయబద్ధంగా తుదిశ్వాస విడిచేంత వరకు ప్రజల కోసమే పాటు పడుతానని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. బుధవారం దుబ్బాక పట్టణంలో ఎంపీ ల్యాడ్స్‌తో నిర్మించిన మెడికల్ అసోసియేషన్ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓట్ల కోసమే రాజకీయాలు చేయడం కాదని అభివృద్ధి చేసి చూపించాలన్నారు. 7 ఏళ్లుగా ఐటీఐ భవన నిర్మాణం పూర్తి కాలేదని ఇది పూర్తయితే లోకల్ విద్యార్థులకు న్యాయం జరిగేదన్నారు. నేను ఎమ్మెల్యే అయ్యాకనే దుబ్బాక–ముస్తాబాద్ డబుల్ రోడ్డు, మెట్టు–చందాపూర్, దౌల్తాబాద్–చేగుంట రోడ్లు వేయించానన్నారు. దుబ్బాక అంబేడ్కర్ విగ్రహం నుంచి హబ్షీపూర్ చౌరస్తా వరకు ఫోర్‌లైన్ రోడ్డు కోసం బీఆర్‌ఎస్ హయాంలో సీఎం ను కలిస్తే నాకు పేరొస్తుందని ఆపించారన్నారు. దుబ్బాకలో మెడికల్ కాలేజీ ఎందుకు లేదని అడిగా, కనీసం నర్సింగ్ కాలేజీ పెట్టమంటే హరీశ్‌రావు వద్దన్నాడని ఆరోపించారు. కొత్త మండలాలకు తహసీల్దార్ కార్యాలయాలు లేవు దుబ్బాక రెవిన్యూ డివిజన్ కోసం పోరాడుతానన్నారు. దుబ్బాకలో మెడికల్ అసోసియేషన్ భవనంకు పార్టీలకు అతీతంగా రూ.10 లక్షలు ఇచ్చానన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు వేంకటేశ్వరుడి ప్రతిమ అందజేశారు. కార్యక్రమంలో మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సత్యందుబ్బాక అధ్యక్షుడు వడ్లకొండ శ్రీధర్, బింగి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.