
ఉద్యోగం పోయిందని మానసిక ఒత్తిడితో..
రేగోడ్(మెదక్): ఉరేసు కొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ పోచయ్య కథనం మేరకు.. వెంకటాపూర్ గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్ (30) గతంలో మిషన్ భగీరథలో ఉద్యోగం చేసేవాడు. ఓ కేసు వల్ల ఉద్యోగం పోయింది. అప్పటి నుంచి మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. మంగళవారం తన కుమారుడి జనన ధ్రువీకరణ పత్రం కోసం పెద్దశంకరంపేటకు వెళ్లాడు. బుధవారం తమ చేనులో చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. మృతుడి భార్య మానస ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
– చెరువులో దూకి వ్యక్తి
కౌడిపల్లి(నర్సాపూర్): చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని సదాశివపల్లిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి కథనం మేరకు.. సదాశివపల్లి గ్రామానికి చెందిన చాకలి క్రిష్ణ(34) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. మంగళవారం సాయంత్రం తాను ఎక్కడైనా వెళ్లి చనిపోతానని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులకు విషయం తెలిసి వెతకగా గ్రామ కనికల చెరువు తూమ్ వద్ద బట్టలు, ఫోన్ కనిపించాయి. రాత్రి చెరువులో వెతికినా జాడ దొరకలేదు. బుధవారం గజ ఈతగాళ్లతో వెతికించగా క్రిష్ణ మృతదేహం బయటపడింది. మృతుడి తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య

ఉద్యోగం పోయిందని మానసిక ఒత్తిడితో..