
10 క్వింటాళ్ల చేపలు మృత్యువాత
నర్సాపూర్ రూరల్: నర్సాపూర్ పట్టణంలోని కోమటికుంటలో బుధవారం సుమారు 10 క్వింటాళ్ల చేపలు మృత్యువాత పడ్డాయి. కోమటికుంటలోకి డ్రైనేజ్ నీళ్లు కలవడంతో చేపలు మృతి చెందాయని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు. కుంట పైభాగంలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, అధికారులు సరైన డ్రైనేజీ, మురికి కాల్వల నిర్మాణాలు చేపట్టకపోవడంతో నేరుగా కుంటలోకి కలుషిత నీరు చేరి చేపలు మృత్యువాత పడ్డాయని ఆవేదన చెందారు. చేపల వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న మత్స్యకారులను ఆదుకోవాలని ఆధార్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నవీన్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు.