
పకడ్బందీగా సీఎం పర్యటన ఏర్పాట్లు
కలెక్టర్ వల్లూరు క్రాంతి
సంగారెడ్డి జోన్: రాష్ట్ర ముఖ్యమంత్రి జహీరాబాద్‌లో ఈనెల 23న పర్యటించనున్న నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...హెలీపాడ్ నుంచి సభాస్థలి వరకు రోడ్డు పనులు పూర్తి చేయాలన్నారు. వాహనాల పార్కింగ్ రూట్లు, స్టేజి అలంకరణ, పరిశుభ్రత, హెల్త్ క్యాంపులు, భగీరథ నీరు, టాయిలెట్స్ తదితర సదుపాయాలు కల్పించాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రాజీవ్ సేవలు చిరస్మరణీయం
ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్: దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. ఖేడ్‌లోని తన స్వగృహం ఆవరణలో బుధవారం రాజీవ్‌గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ చేసిన అభివృద్ధి, ప్రజాసంక్షేమ కార్యక్రమాలను గురించి ఎమ్మెల్యే వివరించారు. ఆయన చూపిన బాటలో ప్రతీఒక్కరూ పయనించాలన్నారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, బ్లాక్‌కాంగ్రెస్ అధ్యక్షుడు భోజిరెడ్డి, జిల్లా నాయకులు సుధాకర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దారం శంకర్, కౌన్సిలర్ వివేకానంద్, ఈశ్వరప్ప తదితరులు పాల్గొన్నారు.
అమీన్‌పూర్
తహసీల్దార్‌గా వెంకటేశ్
పటాన్‌చెరు: అమీన్‌పూర్ నూతన తహసీల్దార్‌గా వెంకటేశ్ బుధవారం సాయంత్రం బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ బదిలీపై వికారాబాద్ వెళ్లారు. ఆయన స్థానంలో వికారాబాద్ నుంచి వెంకటేశ్ ఇక్కడికి బదిలీపై వచ్చి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కార్యాలయ, అధికారులు సిబ్బంది పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అమీన్‌పూర్ పరిధిలో ప్రభుత్వ భూములు కాపాడటంలో నిరంతరం కృషి చేస్తామన్నారు. అధికారులందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
చట్టాలపై అవగాహన
పెంచుకోవాలి
సీనియర్ సివిల్ జడ్జి కవితాదేవి
జహీరాబాద్ టౌన్: ప్రభుత్వ ఉపాధ్యాయులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్‌పర్సన్ కవితాదేవి పేర్కొన్నారు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన ఉపాధ్యాయులకు న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. న్యాయం ప్రతీ ఒక్కరి హక్కు అని ప్రతి ఒక్కరికీ చట్టాల గురించి తెలియాలన్నారు. ఉపాధ్యాయుల పట్ల సమాజంలో మంచి గౌరవం ఉంటుందని తెలిపారు. ఉత్తమమైన విద్యాబోధనతోపాటు బాలకార్మిక నిర్మూలనకు కృషి చేయాలన్నారు.
సంగారెడ్డి తహసీల్దార్‌గా
బాధ్యతల స్వీకరణ
సంగారెడ్డి టౌన్: ఎన్నికల బదిలీల్లో భాగంగా వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల తహసీల్దార్‌గా బదిలీపై వెళ్లిన జయరాం ఇటీవల సంగారెడ్డి జిల్లాకు తిరిగివచ్చారు. బుధవారం జరిగిన బదిలీలలో భాగంగా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆయనను సంగారెడ్డి మండల తహసీల్దార్‌గా నియమించారు. ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ దేవదాస్ జిన్నారం మండలానికి బదిలీ అయ్యారు.

పకడ్బందీగా సీఎం పర్యటన ఏర్పాట్లు

పకడ్బందీగా సీఎం పర్యటన ఏర్పాట్లు