
ఏ ముఖం పెట్టుకొస్తున్నావ్?
జహీరాబాద్: తమ ప్రభుత్వ హయాంలో జహీరాబాద్‌లో చేసిన పనులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ప్రారంభించడానికి వస్తున్నారని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. సీఎం రేవంత్ తీరు చూస్తూ సొమ్మొకరిది సోకొకరిది అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. బుధవారం రాత్రి జహీరాబాద్ వచ్చిన సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్‌లతో కలసి విలేకరులతో మాట్లాడారు. రైల్వే ఫ్లైఓర్ బ్రిడ్జిని బీఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టిందని సీఎం రిబ్బన్ కట్‌చేయడానికి వస్తున్నాడని ఎద్దేవా చేశారు. కేంద్రీయ విద్యాలయాన్ని అప్పటి బీఆర్‌ఎస్ ఎంపీ తీసుకువచ్చిండని, అందులో విద్యార్థులు చేరి ఆరు నెలలవుతుంటే ఇప్పుడు కొబ్బరికాయ కొడతారా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హాయాంలో మా పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలతోపాటు నా సొంత నిధులను కలిపి కోటి రూపాయలతో బసవేశ్వర విగ్రహాన్ని కడితే ఈ ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారా అని వ్యాఖ్యానించారు. జహీరాబాద్ నియోజకవర్గానికి రేవంత్‌రెడ్డి ఏమి ఇచ్చారని ప్రశ్నించారు. కేసీఆర్ ఇచ్చిన రూ.25 కోట్లను, మున్సిపాలిటీకి ఇచ్చిన రూ.30 కోట్లు కూడా వాపస్ తీసుకున్నారని విమర్శించారు.
ఇచ్చినవి కూడా గుంజుకున్నారు
ఎమ్మెల్యే మాణిక్‌రావు వినతి మేరకు గ్రామీణ రోడ్లకు కేసీఆర్ రూ.50 కోట్లు మంజూరు చేస్తే అవి కూడా గుంజుకున్నారని హరీశ్‌రావు విమర్శించారు. జహీరాబాద్ మీద రేవంత్‌రెడ్డి ప్రేమ ఉంటే తీసుకున్న నిధులను వెంటనే తిరిగివ్వాలని, పాతవి ఇచ్చి కొత్తగా రూ.100కోట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించడం కాదు సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసే బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులను పునరుద్ధరించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రజల తరఫున డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లాలో 21వేల మెట్రిక్ టన్నుల జొన్నలు కొని రైతులకు ఇవ్వాల్సిన రూ.72కోట్లలో ఇప్పటి వరకు సీఎం రేవంత్‌రెడ్డి ఒక్క రూపాయి కూడ ఇవ్వలేక పోయారన్నారు. రేవంత్‌రెడ్డిది పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వమని, ఇచ్చిన హామీల్లో ఒక్క దానిని కూడా పూర్తిగా అమలు చేయలేక పోయిందని మండిపడ్డారు.
తాము చేసిన పనులకు
ప్రారంభోత్సవాలా!
సీఎం రేవంత్‌కు హరీశ్ రావు ప్రశ్న
జిల్లాలో సంగమేశ్వర, బసవేశ్వర సాగునీటి పథకాలను అటకెక్కించారు
కేసీఆర్ మంజూరు చేసిన నిధులు
వెనక్కి ఇవ్వాలని డిమాండ్