
ఉత్తమ సేవలకు పురస్కారం
సంగారెడ్డి జోన్: విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన పలువురు అధికారులకు ప్రశంసాపత్రాలు అందించారు. రాష్ట్ర డీజీపీ జితేందర్ చేతుల మీదుగా బొల్లారం, జహీరాబాద్ సి.ఐలు రవీందర్‌రెడ్డి, శివలింగంతోపాటు హెడ్ కానిస్టేబుల్ రఫిక్, సీత్య నాయక్‌లను అభినందించి వారికి ప్రశంసాపత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ పరితోశ్ పంకజ్ మాట్లాడుతూ...రాష్ట్రవ్యాప్తంగా అతి తక్కువ సమయంలో కేసును పరిష్కరించి నిందితుడికి మరణ శిక్ష విధించడంలో బొల్లారం సి.ఐతోపాటు హెడ్ కానిస్టేబుల్ ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో బెస్ట్ కన్విక్షన్ అవార్డ్ అందుకున్నారన్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలో సుమారు రూ.3 కోట్ల విలువ గల ఆస్థి నేరాన్ని పరిష్కరించి, అత్యుత్తమ కేసుల ఛేదనలో జహీరాబాద్ సి.ఐ రాష్ట్ర స్థాయిలో జిల్లా గుర్తింపు పొందారని వివరించారు. రాష్ట్రస్థాయిలో జిల్లాకు గుర్తింపు రావడం సంతోషకరమన్నారు.
ప్రశంసాపత్రాలు అందజేసిన డీజీపీ