
సేవలు బాగున్నాయా..?
ప్రభుత్వాస్పత్రిలో రోగుల బాగోగులపై
ఎమ్మెల్యే మాణిక్‌రావు ఆరా
జహీరాబాద్: స్థానిక ఏరియా ప్రభుత్వాస్పత్రిని ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పలువార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను కలసి ఆస్పత్రి సేవల గురించి వారి బాగోగుల గురించి ఆరా ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్, ఇతర వైద్యులు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్‌రావు వారితో మాట్లాడుతూ..ఆస్పత్రికి వచ్చే రోగులకు ప్రతీ విభాగంలో సిబ్బంది అంకితభావంతో సేవలందించాలన్నారు. వచ్చే నెలలో తిరిగి సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రోగులకు ఉత్త మ సేవలందించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు నామ రవికిరణ్, బండి మోహన్ పాల్గొన్నారు.