
డంపింగ్‌యార్డ్ రద్దుకు సంతకాల సేకరణ
జిన్నారం (పటాన్‌చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని ప్యారానగర్ వద్ద డంపింగ్‌యార్డ్ ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని లేని పక్షంలో అసెంబ్లీ సమావేశాలను స్తంభింపచేస్తామని ప్రజాసంఘాల పోరాట వేదిక కన్వీనర్ రాజయ్య హెచ్చరించారు. ఆదివారం రద్దు ప్రక్రియకు మద్దతుగా జేఏసీ ఆధ్వర్యంలో ప్రజాసంఘాల పోరాట వేదిక తరఫున సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. మండలంలోని కానుకుంట, అనంతారం, గుమ్మడిదల, బొంతపల్లి, దోమడుగు, అన్నారం, మంబాపూర్ గ్రామాలలో పర్యటించి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ...డంపింగ్‌యార్డ్ రద్దు చేయాలని నేటికీ 40 రోజులుగా ఉద్యమిస్తున్నా ప్రభుత్వం గుర్తించకపోవడం దుర్మార్గమన్నారు.