
భక్తిశ్రద్ధలతో మహామృత్యుంజయ యజ్ఞం
ఝరాసంగం(జహీరాబాద్): జిల్లాలో ప్రకృతి నిలయం, ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లుతోన్న బర్దీపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో వార్షిక అమర తిథి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని బెల్లాపూర్ గ్రామం నుంచి బర్దీపూర్ ఆశ్రమం వరకు చేపట్టిన పాదయాత్ర, పల్లకీసేవ శనివారం రాత్రి చేరుకుంది. ఆశ్రమ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ108వైరాగ్య శిఖామణి అవధూతగిరి మహారాజ్, డా.సిద్దేశ్వర స్వామి ఆధ్వర్యంలో గణపతి పూజ, గోపూజ, పుణ్యహవచనం, మహామృత్యుంజయ లక్షజప యజ్ఞం చేశారు.
ప్రత్యేకపూజల్లో కేశవరావు
దత్తగిరి ఆశ్రమంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు కె.కేశవరావు హాజరయ్యారు.
ఆన్‌లైన్ బెట్టింగ్‌పై
ప్రత్యేక నిఘా
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
సంగారెడ్డి జోన్: ఆన్‌లైన్ బెట్టింగ్, గేమ్స్ కట్టడికి జిల్లా పోలీసుశాఖ ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామ ని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడినా, గేమ్స్ ఆడినా, ప్రోత్సహించినా వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆన్‌లైన్ గేమింగ్ మాటున ప్రమాదకర మాల్‌వేర్ ఉందని, ఫేక్‌లింక్స్‌తో వ్యక్తిగత సమాచారం, అకౌంట్ వివరాలు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని, గేమింగ్ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఢిల్లీకి వెళ్లిన బీమా ఏజెంట్లు
నారాయణఖేడ్: తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం అఖిల భారత జీవిత బీమా ఏజెంట్ల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 19న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో తలపెట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఖేడ్ ప్రాంత బీమా ఏజెంట్లు ఆదివారం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. బీమా పాలసీలపై విధిస్తోన్న జీఎస్టీని రద్దుచేయాలని, బోనస్ పెంచాలని, 70 ఏళ్లుగా పనిచేస్తున్న ఏజెంట్లకు తగ్గించిన కమిషన్‌ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. మేరకు డిమాండ్లతో కూడిన కరపత్రాలను ప్రదర్శించారు.
గురుకుల ప్రవేశపరీక్షకు
దరఖాస్తుల స్వీకరణ
జహీరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి 6,7,8,9వ తరగతులలో మిగిలి ఉన్న ఖాళీల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఝరాసంగం, దిగ్వాల్ బాలుర గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హరీశ్వర్‌రెడ్డి కోరారు. ఈ నెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ 20న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.
సమస్యల పరిష్కారానికి కృషి
పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్
కల్హేర్(నారాయణఖేడ్): ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో పీఆర్టీయూ కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడిగా గుండు లక్ష్మణ్ ప్రమాణం చేశారు. కల్హేర్ మండలం బీబీపేటకు చెందిన గుండు లక్ష్మణ్ మార్డి ఉన్నత పాఠశాలలో పీజీ హెచ్‌ఎంగా పని చేస్తున్నారు. ఆయన ఇప్పటికే పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఇప్పటివరకు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన శ్రీపాల్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన స్థానంలో గుండు లక్ష్మణ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

భక్తిశ్రద్ధలతో మహామృత్యుంజయ యజ్ఞం

భక్తిశ్రద్ధలతో మహామృత్యుంజయ యజ్ఞం

భక్తిశ్రద్ధలతో మహామృత్యుంజయ యజ్ఞం