
చట్టాలను సద్వినియోగం చేసుకోవాలి
సిద్దిపేటజోన్: మహిళలకు అన్ని రకాల చట్టాలు అందుబాటులో ఉన్నాయని, సద్వినియోగం చేసుకోవాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ, న్యాయమూర్తి స్వాతిరెడ్డి సూచించారు. గురువారం స్థానిక టీటీసీ భవన్‌లో స్వార్డ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. మహిళలు, పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో సమానంగా పనిచేస్తున్నారన్నారు. న్యాయ సలహాలు, సూచనల కోసం 15100 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, ప్రతినిధులు పాల్గొన్నారు.
న్యాయమూర్తి స్వాతిరెడ్డి