గ్రూప్‌–2 ఫలితాల్లో సత్తా చాటిన రాజ్‌కుమార్‌ | - | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–2 ఫలితాల్లో సత్తా చాటిన రాజ్‌కుమార్‌

Mar 12 2025 9:05 AM | Updated on Mar 12 2025 9:05 AM

గ్రూప

గ్రూప్‌–2 ఫలితాల్లో సత్తా చాటిన రాజ్‌కుమార్‌

385 మార్కులతో 168వ ర్యాంకు

ప్రస్తుతం వాణిజ్యపన్నుల విభాగంలో

జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు..

నారాయణఖేడ్‌: ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గ్రూప్‌–2 ఫలితాల్లో నారాయణఖేడ్‌ జంట గ్రామం మంగల్‌పేట్‌కు చెందిన రాజ్‌కుమార్‌ 600 మార్కులకు 385 మార్కులతో రాష్ట్రస్థాయిలో ఓపెన్‌ కేటగిరీలో 168వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. రాజ్‌కుమార్‌ సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించి, ప్రాథమికస్థాయి నుంచి నవోదయలో విద్యాభ్యాసం చేశారు. కర్ణాటక సెంట్రల్‌ యూనివర్సీటీలో ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ పూర్తి చేసి ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ఆలోచనతో ఉద్యోగం కోసం పోటీ పరీక్షలు రాస్తున్నారు. ఈ క్రమంలో గత నవంబర్‌లో గ్రూప్‌–4 ఫలితాలు విడుదల చేయడంతో అందులో సత్తా చాటి వాణిజ్య పన్నుల విభాగంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం దక్కించుకున్నారు. ఇంకా మెరుగైన ఉద్యోగం కోసం గ్రూప్‌–2 పరీక్షలు రాశారు. గ్రూప్‌ 2లో రాజ్‌కుమార్‌ విజయం పట్ల గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు అభినందిస్తున్నారు.

సమానత్వం ఇంటి నుంచే

ప్రారంభం కావాలి

సంగారెడ్డి జోన్‌: మహిళల సమానత్వం ముందు మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని జిల్లా పరిషత్తు సీఈఓ జానకిరెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పరిషత్తు కార్యాలయంలో పంచాయతీరాజ్‌ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మహిళా ఉద్యోగులకు సన్మానం చేసి, జ్ఞాపికలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంట్లో ఆడపిల్లలను, మగ పిల్లలను సమానంగా చూస్తూ చదివించాలన్నారు. మహిళలు అన్ని రంగాలలో పురోగమించేలా చేయడమే ప్రభుత్వ సంకల్పం అని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ మినిస్ట్రియల్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు యస్‌.సూర్యకాంత్‌, కార్యదర్శి రఘు, ఆర్‌.స్వప్న మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

డంప్‌యార్డ్‌ను రద్దు చేయాలి

రామచంద్రాపురం (పటాన్‌చెరు): కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు వెంటనే నల్లవల్లి, ప్యారానగర్‌ డంపింగ్‌ యార్డ్‌ రద్దు చేయాలని ప్రజాసంఘాల పోరాట వేదిక కన్వీనర్‌ కె.రాజయ్య డిమాండ్‌ చేశారు. రామచంద్రాపురంలోని పీసీబీ జోనల్‌ కార్యాలయం వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... డంప్‌యార్డ్‌ వల్ల కాలుష్యం ఉండదని ప్రజల మధ్యలోకి వచ్చి అధికారులు చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. డంపింగ్‌ యార్డ్‌ ఏర్పాటుతో వాయు, జల కాలుష్యం ఉంటుందని ప్రజలు చెప్తుంటే అధికారులు మాత్రం అనుమతులు ఎలా ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఖేడ్‌ నుంచి బయల్దేరిన

పాదయాత్ర

నారాయణఖేడ్‌: దత్తగిరి మహారాజ్‌ 46వ అమరతిథి సందర్భంగా కొనసాగుతున్న పాదయాత్ర, పల్లకీసేవ (రథయాత్ర) మంగళవారం రాయిపల్లి మార్గంలో బయల్దేరింది. సోమవారం మనూరు మండలం బెల్లాపూర్‌ దత్తగిరి ఆశ్రమం నుంచి ఈ యాత్ర బయల్దేరి రాత్రి ఖేడ్‌కు చేరుకుంది. రాత్రి పాదయాత్రికులు ఖేడ్‌లోని దత్తగిరి ఆశ్రమంలో బసచేశారు. మంగళవారం తెల్లవారు జామున యాత్ర రాయిపల్లి మార్గంలో బయల్దేరింది. ఈ నెల 15న బర్దీపూర్‌ ఆశ్రమానికి చేరుకోనుంది. ఖేడ్‌ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఖేడ్‌ దత్తగిరి ఆశ్రమాన్ని సందర్శించగా నిర్వాహకులు ఆయనను శాలువాతో సన్మానించారు.

గ్రూప్‌–2 ఫలితాల్లో సత్తా చాటిన రాజ్‌కుమార్‌1
1/2

గ్రూప్‌–2 ఫలితాల్లో సత్తా చాటిన రాజ్‌కుమార్‌

గ్రూప్‌–2 ఫలితాల్లో సత్తా చాటిన రాజ్‌కుమార్‌2
2/2

గ్రూప్‌–2 ఫలితాల్లో సత్తా చాటిన రాజ్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement