సన్మానం | - | Sakshi
Sakshi News home page

సన్మానం

Published Sat, Jun 15 2024 8:20 AM | Last Updated on Sat, Jun 15 2024 8:20 AM

సన్మా

నారాయణఖేడ్‌: కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌మున్షీని హైదరాబాద్‌లో శుక్రవారం జహీరాబాద్‌ ఎంపీ సురేశ్‌ షెట్కార్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచిన షెట్కార్‌ను ఆమె అభినందించారు. అనంతరం మున్షికి పుష్ప గుచ్ఛం అందించి శాలువాతో సన్మానించారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌, టీపీసీసీ క్యాంపెయిన్‌ కమిటీ చైర్మన్‌, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్‌, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తదితరులు ఉన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

సంగారెడ్డి టౌన్‌: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు శిక్షణ పొందేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి యం.ఫిరంగి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.3లక్షలకు మించరాదని పేర్కొన్నారు. ఈనెల 30వ తేదీలోగా http//rt udycirce.cff.gov.in వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 6281766534 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

రైతుసేవా కేంద్రాలతో

సాగు బలోపేతం

పుల్‌కల్‌(అందోల్‌): ప్రభుత్వ గుర్తింపు పొందిన ఎరువుల దుకాణాల్లోనే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాలని జోగిపేట ఏడీఏ అరుణ సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని గొంగ్లూర్‌ రైతుసేవా కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం మండలంలోని పలు ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి సారిక, ఏఈఓ మనీష, రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు.

ఇటుక బట్టీల్లో తనిఖీలు

జిన్నారం(పటాన్‌చెరు): మండలంలోని ఖాజీపల్లి గ్రామ పరిధిలోని ఇటుక బట్టీల్లో శుక్రవారం రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇటుక బట్టీల్లో బాల కార్మికులు పనులు చేస్తున్నారని, అక్రమంగా మట్టిని సేకరిస్తున్నారనే ఫిర్యాదులు రావటంతో సోదాలు నిర్వహించారు. తహసీల్దార్‌ భిక్షపతి ఆదేశాల మేరకు ఆర్‌ఐ జయప్రకాశ్‌నారాయణ కార్మికులు, యాజమాన్యాలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆర్‌ఐ మాట్లాడుతూ ఇటుక బట్టీల్లో బాల కార్మికులు ఎవరూ లేరని తెలిపారు. అనుమతులు లేకుండా మట్టిని సేకరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సెల్‌ టవర్‌ ఏర్పాటు వద్దు

సంగారెడ్డి టౌన్‌: పట్టణంలోని ద్వారకా నగర్‌లో సెల్‌ టవర్‌ ఏర్పాటు చేయొద్దని కాలనీవాసులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో డీఆర్‌ఓ పద్మజారాణికి వినతిపత్రం అందజేశారు. సెల్‌ టవర్‌ రేడియేషన్‌ వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వెంటనే టవర్‌ పనులు నిలిపివేయాలని కోరారు. మున్సిపల్‌ కౌన్సిలర్‌ రాజేందర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు .

మహిళలకు ఉచిత శిక్షణ

సంగారెడ్డి టౌన్‌: మగ్గం వర్క్‌లో మహిళలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్టేట్‌ బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ డైరెక్టర్‌ వంగ రాజేంద్రప్రసాద్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలోని మహిళలకు జూన్‌ 25నుంచి నెల రోజుల పాటు శిక్షణ ఉంటుందని, దీంతోపాటు ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ట్రైనింగ్‌ పూర్తయిన తర్వాత మహిళలకు సర్టిఫికెట్లను అందజేస్తామని తెలిపారు. 18 నుంచి 45 ఏళ్ల వయసు ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు సంగారెడ్డి బైపాస్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు 9490129839, 9704446956 నంబర్‌కు ఫోన్‌ చేయాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
సన్మానం
1/2

సన్మానం

సన్మానం
2/2

సన్మానం

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement