కొండాపూర్(సంగారెడ్డి): అభివృద్ధి, సంక్షేమం బీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ అభ్యర్థి చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని గొల్లపల్లి, మునిదేవునిపల్లి, మన్సాన్ పల్లి, మల్కాపూర్ , కోనాపూర్, మాదాపూర్, గంగారం, శివన్నగూడెం గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం , విఠల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment