
సంగారెడ్డి: అక్కతో గొడవ పడి చెల్లెలు క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండలంలోని బొల్లారం పీఎస్ పరిధిలో సోమవారం రాత్రి జరిగింది. సీఐ నయీమోద్దీన్ కథనం ప్రకారం.. ఒడిశాకు చెందిన పూజ్య(18) తన అక్క, స్నేహితులతో కలిసి బొల్లారంలో నివాసం ఉంటున్నది. కాగా అక్క పున్నికి, తోటి స్నేహితుల మధ్య గొడవ జరిగింది. అందులో తన ప్రస్థావన తెచ్చారని మనస్తాపం చెందిన ఆమె రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని తోటి స్నేహతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి అక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ వివరించారు.
ముఖ్య గమనిక:
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com