ఇంత దారుణంగా.. వివాహితను హత్య చేసిందెవరు?

- - Sakshi

ఏడాది క్రితం వలసవచ్చి..

ఎప్పటిలాగే కూలీ పని కోసం ఇంటి నుంచి వెళ్లిన వైనం!

ఐదురోజుల క్రితం దుండగులు హత్య..

అటవీ ప్రాంతంలో మహిళ మృతదేహం గుర్తింపు!

సాక్షి, సంగారెడ్డి: వివాహిత హత్యకు గురైన సంఘటన గుమ్మడిదల మండలంలో ఆలస్యంగా బుధవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా శ్రీరంగపురం మండలం తాటిపాముల గ్రామానికి చెందిన ముడావత్‌ శివనాయక్‌, మంగమ్మ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. ఏడాది క్రితం వలసవచ్చి హైదరాబాద్‌లోని బాలానగర్‌ సమీపంలో నివాసం ఉంటున్నారు.

అతను డ్రైవర్‌, ఆమె అడ్డా కూలీగా పనులు చేసుకుంటున్నారు. గత నెల 28న మంగమ్మ ఎప్పటిలాగే కూలీ పని కోసం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె అదృశ్యంపై భర్త బాలానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా గురువారం రాత్రి గుమ్మడిదల మండలం నల్లవల్లి అటవీ ప్రాంతంలో ఫారెస్టు అధికారులు విధులు నిర్వహిస్తున్న సమయంలో చెట్ల పొదల్లో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. అదే విషయాన్ని పోలీసులకు చెప్పారు.

వారు శివనాయక్‌కు గుర్తించిన ఆ మహిళ మృతదేహం ఒక్కసారి చూడాలని సూచించారు. దానికి అతను అంగీకరించి అక్కడికి వెళ్లి పరిశీలించగా అది భార్య మృతదేహమేనని గుర్తుపట్టాడు. అయితే ఐదురోజుల క్రితం దుండగులు హత్య చేసి అటవీ ప్రాంతంలో పడేసి వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. అప్పటికే మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ లక్ష్మారెడ్డి తెలిపారు.
ఇవి చదవండి: 'కార్మిక కుటుంబాల్లో.. తీరని శోకం!' ఈ ప్రమాదాలు ఇంకెన్నాళ్లు?

Read latest Sangareddy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top