షాద్‌నగర్‌రూరల్: సర్కారు బడుల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని డీఈఓ వెంకటేశ్వర్లు అన్నారు. ఎంఈఓ మనోహర్‌తో కలిసి గురువారం పట్టణంలోని ఎంఆర్‌సీ భవనం, వెంకటేశ్వరకాలనీ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. విద్యాబోధన ఏ విధంగా ఉంది, వసతులు ఎలా ఉన్నాయి అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. సీఆర్‌పీలు విద్యార్థుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అకడమిక్‌ను ప్రారంభించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారని, విద్యార్థులకు మంచి బోధన అందుతుందన్నారు. మధ్యాహ్నభోజనం, దుస్తులు, నోటుపుస్తకాలు, పాఠ్యపుస్తకాలు ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీఆర్‌పీలు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.
కొందుర్గు కేజీబీవీ సందర్శన
కొందుర్గు: విద్యార్థులకు నాణ్యమైన చదువు అందించడంలో ఉపాధ్యాయుల కృషి ఎంతో గొప్పదని డీఈఓ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం ఆయన కొందుర్గు కేజీబీవీని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆహార పదార్థాలు, స్టాకు రిజిస్టర్, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు రిజస్టర్ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నతస్థాయికి ఎదగాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈఓ గాయత్రిదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
డీఈఓ వెంకటేశ్వర్లు


