మాడ్గుల: అధిక సాంద్రత విధానంలో పత్తి సాగుపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి శైలజ తెలిపారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధిక సాంధ్రత పద్ధతిలో రైతులు తక్కువ ఖర్చుతోపాటు సమయాన్ని ఆదా చేసుకోవచ్చని, అధిక దిగుబడి సాధించవచ్చని అన్నారు. అనంతరం అన్నబోయిన్‌పల్లి గ్రామంలో మ్యాటిక్ ప్లాంటర్ మిషిన్‌తో విత్తనాలు వేస్తున్న పొలాన్ని పరిశీలించారు. మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. నకిలీవి అమ్మినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏడీఏ శోభారాణి, విస్తరణ అధికారులు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి శైలజ


