ఫిట్స్‌తో రిమాండ్‌ ఖైదీ మృతి | - | Sakshi
Sakshi News home page

ఫిట్స్‌తో రిమాండ్‌ ఖైదీ మృతి

Apr 15 2026 8:44 AM | Updated on Apr 15 2026 8:44 AM

ఆమనగల్లు: సీతారాంనగర్‌ తండా గ్రామ పరిధిలోని పులుగోనిపల్లి తండాలో భార్య, కొడుకును హత్యచేసి జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న వ్యక్తి ఫిట్స్‌తో మృతిచెందాడు. సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. పులుగోనిపల్లి తండాకు చెందిన బానావత్‌ రాందాస్‌ కుటుంబు కలహాలు, మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి గత నెల 31న ఉదయం 5 గంటల సమయంలో భార్య కవిత, కుమారుడు హర్షరోహిత్‌పై దాడిచేయడంతో వారు మృతిచెందారు. రెండు రోజుల తరువాత రాందాస్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న అతనికి సోమవారం రాత్రి ఫిట్స్‌ రావడంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

గుర్తు తెలియని

మృతదేహం లభ్యం

ధారూరు: మండల కేంద్రంలో ని ధారూరు – తాండూరు రై ల్వే ట్రాక్‌ పక్క న మంగళవా రం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. తాండూరు రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ వీరేశం తెలిపిన వివరాల ప్రకారం.. రై ల్వే ట్రాక్‌ పక్కన వ్యక్తి మృతదేహం ఉన్న ట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. వెంటనే అక్కడికి వెళ్లి పరిశీలించామన్నారు. దాదాపు 35 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి ఒంటిపై బూడిద రంగు ప్యాంట్‌, గులాబీ రంగు షర్ట్‌ ఉందని తెలిపారు. మృతదేహాన్ని తాండూ రు రైల్వే ఆస్పత్రికి తరలించి, పోస్టు మార్టం అనంతరం మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు. మృతుడికి సంబంధించిన వారు వికారాబాద్‌ రైల్వే పోలీసులను సంప్రదించాలని సూచించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement