తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు
కొత్తూరు: ఆడుకుంటూ తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన ఇద్దరు చిన్నారులను స్థానికుల సమాచారంతో పోలీసులు వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సంఘటన మండలంలోని గూడూరు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ నర్సయ్య తెలిపిన వివరాల మేరకు.. బీహార్ రాష్ట్రానికి చెందిన రాజు, పూజ దంపతులు. వీరికి (రిషబ్, ప్రీతి) మూడు, నాలుగేళ్ల వయస్సున్న కూతురు, కుమారుడు ఉన్నారు. భార్యాభర్తలు మున్సిపాలిటీ పరిధిలోని కుమ్మరిగూడలో నూతనంగా నిర్మిస్తున్న ఓ ఇంటి వద్ద కూలీలుగా పనిచేస్తుండగా ఇద్దరు చిన్నారులు అక్కడే ఆడుకుంటున్నారు. వీరు పనిలో నిమగ్నం కాగా చిన్నారులు అక్కడి నుండి నడుచుకుంటు గూడూరు వద్దకు చేరుకున్నారు. గమనించిన గ్రామానికి చెందిన సుబ్రమణ్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చుట్టు పక్కల విచారణ చేపట్టి తల్లిదండ్రులకు అప్పగించారు.


