ఇబ్రహీంపట్నం: స్థానిక న్యాయస్థానంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 169 కేసులు పరిష్కారమయ్యాయి. ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో 77, మంచాల పరిధిలో 23, యాచారం పరిధిలో 27, ఫార్మాసిటీ పరిధిలో 8, మాడ్గుల పరిధిలో 34 కేసులు పరిష్కారం అయినట్లు 15వ అదనపు జిల్లా న్యాయమూర్తి జి. ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ
యువకుడి మృతి
ఆమనగల్లు: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడి మృతి చెందిన సంఘటన పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం.. మారుతి షోరూం ఎదురుగా హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, బైక్ ఎదురెదురుగా ఢీకొనడంతో పల్లపు చరణ్(20) అక్కడికక్కడే మృతిచెందాడు. మండలంలోని మంగళపల్లి చెన్నకేశవ కాలనీకి చెందిన చరణ్ స్థానిక పట్టణంలో ట్రాక్టర్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. కాగా ఆయన బైక్‌పై వెళుతుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చరణ్ అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనా స్థలాన్ని ఆమనగల్లు సీఐ వెంకటేశ్వర్లు సందర్శించి వివరాలు సేకరించారు. కాగా హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారి మరమ్మతులు చేస్తుండటంతో ఒకవైపు రోడ్డును మూసి ఉంచి రాకపోకలు సాగిస్తుండటంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు
డీజిల్ వాహనం, గ్యాస్ సిలిండర్లు, ఎర్రమట్టి సీజ్
అనంతగిరి: అక్రమ రవాణా, వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ స్నేహ మెహ్ర హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా శనివారం టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్‌కే అన్వర్ పాషా ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు నిర్వహించినట్లు తెలిపారు. కర్ణాటక రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న డీజిల్ ట్యాంకర్‌ను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. నగరంలోని మియాపూర్‌కు చెందిన గో ల్కొండ రాజు ట్యాంకర్‌ను, డ్రైవర్లు గొనెళ్ల కిరణ్, అనిగెల అనిల్ అదుపులోకి తీసుకున్నట్లు చెప్పా రు. వీరిపై చెన్గోముల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మన్నెగూడ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా ఎర్రమట్టిని తరలిస్తున్న టిప్పర్‌ను టాస్క్ ఫోర్స్ బృందం పట్టుకున్నట్లు వివరించారు. వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ ఉంచినట్లు సమాచారం అందడంతో దా డి చేసి 4 డొమెస్టిక్ ఫుల్ సిలిండర్లు, 14 ఖాళీ సిలిండర్లు, 6 కమర్షియల్ సిలిండర్లను సీజ్ చేసినట్లు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్ప వని ఎస్పీ హెచ్చరించారు.
చిరువ్యాపారులను ఆదుకోండి
ఎంఐఎం నియోజకవర్గ అధ్యక్షుడు గుల్షన్
కొడంగల్ రూరల్: రోడ్డు విస్తరణలో డబ్బాలు తొలగించడంతో జీవనోపాధి కోల్పోయిన చిరువారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎంఐఎం నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్‌బీ గుల్షన్ కోరారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ నందారం ప్రశాంత్‌కుమార్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. చిరు వ్యాపారుల సమస్యలను చైర్మన్‌కు వివరించారు. స్పందించిన చైర్మన్ బాధితులకు అండగా ఉంటానని, వారం రోజుల్లో కాంప్లెక్స్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం చైర్మన్‌ను చిరువ్యాపారులు, గుల్షన్ సన్మానించారు. కార్యక్రమంలో ఎండీ సర్తాజ్ హుస్సేన్, సయ్యద్ మహమూద్, ఎండీ జహంగీర్, ఎండీ అక్తర్, ఎండీ కబీర్, నారాయణ, సుందర్, సయ్యద్ అర్షద్ అలీ ఖాద్రి పాల్గొన్నారు.
రేపు జిల్లా స్థాయి సెలక్షన్స్
అనంతగిరి: క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం మండల స్థాయిలో ఎంపికై న విద్యార్థులకు రేపు(సోమవారం) వికారాబాద్‌లో జిల్లాస్థాయి సెలక్షన్స్ ఉంటాయని క్రీడల విభాగం జిల్లా అధికారి ఎంఏ సత్తార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద యం 9.30 గంటలలోపు పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్‌కు హాజరుకావాలని సూచించారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫాం, ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, 3వ తరగతి బోనాఫైడ్, ప్రొగ్రెస్ కార్డు, కులం సర్టిఫికె ట్, సైజ్ ఫొటోలతో రావాలని సూచించారు.
తైబజారు వేలం..
బొంరాస్‌పేట: మండలంలోని తుంకిమెట్ల ఆదివారపు సంతకు ఈ నెల 30న వేలం నిర్వహించనున్న ట్లు సర్పంచ్ ఎల్లమ్మ శనివారం తెలిపారు. ఉద యం 11గంటలకు గ్రామ రైతు వేదికలో వేలం ఉంటుందన్నారు. పాట దక్కించుకున్న వారు ఏప్రిల్ ఒకటి నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు తైబజారు నిర్వహించుకోవచ్చని తెలిపారు. ఆసక్తి గలవారు వేలంలో పాల్గొనాలని ఆమె కోరారు.


