అనంతగిరి: రబీ సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం సేకరణ లక్ష్యాన్ని అధిగమించాలని అడిషనల్ కలెక్టర్ రాజేశ్వరి అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు రావొద్దన్నారు. జిల్లాలో 129 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నందున కాంటాలు, గన్నీ బ్యాగులు, ఎప్పటికప్పుడు ధాన్యం రవాణాకు లారీలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ధాన్యం సేకరణ సజావుగా జరిగేలా చూడాన్నారు. వివిధ ఏజెన్సీల ద్వారా లక్ష మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, పది వేల మెట్రిక్ టన్నుల సన్న రకం వడ్ల సేకరించాలని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ రాములు నాయక్, పౌరసరఫరాల శాఖ అధికారి సుదర్శన్, జిల్లా మేనేజర్ మోహన్‌కృష్ణ, జిల్లా రవాణా అధికారి వెంకట్‌రెడ్డి, డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ వెంకటరమణారెడ్డి, డిప్యూటీ డీఆర్‌డీఓ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.


