అంగన్‌వాడీ కేంద్రంలో చోరీ
మొయినాబాద్‌రూరల్: అంగన్‌వాడీ కేంద్రంలో చోరీ జరిగిన సంఘటన స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగిరెడ్డిగూడ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి దుండగులు అంగన్‌వాడీ కేంద్రం కిటికీలను ధ్వంసం చేసి దూరారు. వంట సామగ్రి, సిలిండర్ తదితర వాటిని అపహరించుకుపోయారు. దీనిపై అంగన్‌వాడీ టీచర్ అమరజ్యోతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హుండీ పగలగొట్టి..
మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మేడిపల్లి గ్రామంలో గల ఉమామహేశ్వర దేవాలయంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హుండీని పగలగొట్టి నగదు దొంగలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవాలయంలో దొంగలు హుండీ తాళం పగులగొట్టి అందులో ఉన్న రూ.15 వేలు దొంగిలించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.


