దేశాన్ని ఏకం చేసిన ఉక్కుమనిషి
పరిగి/ తాండూరు టౌన్: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో.. భారత్‌లో ఐదు వందలకు పైగా స్వతంత్య్ర రాజ్యాలు ఉండేవి. వాటన్నింటినీ ఏకం చేసిన గొప్ప నాయకుడు సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ అని పరిగి డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. ఉక్కుమనిషి, దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం పట్టణ కేంద్రంలో ఐక్యతా ర్యాలీ(రన్ ఫర్ యూనిటీ) నిర్వహించారు. తహసీల్దార్‌కార్యాలయం నుంచి కొడంగల్ కూడలి వరకు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పటేల్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీమన్నారు. చిన్న చిన్న రాజ్యలను ఏకం చేసి, అఖండ భారతదేశాన్ని నిర్మించారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ మోహనకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సమైక్యతే మహాబలం
దేశంలో వందలాది సంస్థానాలను ఏకం చేసి, నవ భారతాన్ని నిర్మించిన మహనీయుడు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అని తాండూరు డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి అన్నారు. సమైక్యతతో ఏదైనా సాధించవచ్చని, అదే మహాబలమని నిరూపించిన ఘనుడు అని పేర్కొన్నాడు. దేశ తొలి ఉప ప్రధాని వల్లభ్ భాయ్ జయంతిని పురస్కరించుకొని తాండూరు డివిజన్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ ర్యాలీ నిర్వహించారు. రూరల్ సీఐ నగేష్, పట్టణప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక విలియంమూన్ కూడలి నుంచి ఇందిరాచౌక్ వరకు ర్యాలీ తీశారు. కార్యక్రమంలో కృష్ణ ముదిరాజ్, భద్రేశ్వర్, సుదర్శన్ గౌడ్, మల్లేశం, జుంటుపల్లి వెంకటేశ్, దత్తాత్రేయ, యువత, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సర్దార్ సేవలు చిరస్మరణీయం
డీఎస్పీలు శ్రీనివాస్, బాలకృష్ణారెడ్డి
ఘనంగా సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ జయంతి


