పెళ్లయిన నెల రోజుల్లోనే వరుడి మృతి
పహాడీషరీఫ్: వివాహం జరిగిన నెల రోజుల లోపే వరుడు మృతిచెందాడు. ఈ సంఘటన జల్‌పల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పోలెమోని భిక్షపతి కుమారుడు శివనాథ్ ముదిరాజ్(35)కు, అక్టోబర్ 11న శంషాబాద్‌కు చెందిన యువతితో వివాహం జరిగింది. వారం అనంతరం అనారోగ్యానికి గురైన యువకుడు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. యువకుడి అకాల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
ప్రచార బోర్డును ఢీకొన్న కారు
ఒకరి మృతి
కొత్తూరు: ప్రచార బోర్డును కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన కొత్తూరు పట్టణం పెంజర్ల కూడలీ జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. సీఐ నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని నార్సింగి ప్రాంతానికి చెందిన హరినాథ్‌రెడ్డి(55), కొంత కాలంగా నందిగామ మండలం మేకగూడ గ్రామంలోని హిమాక్షి బేకర్స్ పరిశ్రమలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే తన కారులో విధులకు వస్తుండగా.. రోడ్డు పక్కనే ఉన్న ఓ ప్రచార బోర్డును ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో గాయపడిన హరినాథ్‌ను.. స్థానికులు పరిశ్రమ నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. వారు క్షత్రగాత్రున్ని చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. మృతుడి బంధువు మురళీమోహన్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
పెళ్లయిన నెల రోజుల్లోనే వరుడి మృతి
పెళ్లయిన నెల రోజుల్లోనే వరుడి మృతి


