దీపాదాస్ మున్సీపరువునష్టం కేసు వాయిదా
● వచ్చే విచారణలోగా ప్రాసిక్యూషన్ తరఫున సాక్ష్యాలు దాఖలు చేయాలి
● జనవరి 23కు విచారణ వాయిదా
సిటీ కోర్టులు : బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్‌పై దాఖలైన పరువు నష్టం కేసుపై శుక్రవారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు విచారణకు ఫిర్యాదుదారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, ప్రతివాది బీజేపీ నేత ప్రభాకర్ గైర్హాజరయ్యారు. దీపాదాస్ మున్షీ తరుఫున న్యాయవాది థామస్ లాయిడ్, ప్రభాకర్ తరుఫున న్యాయవాది వేణుగోపాల్ హాజరై పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు విచారణను జనవరి 23కు వాయిదా వేసింది. ఆ రోజు ప్రాసిక్యూషన్ తరుఫున సాక్ష్యం దాఖలు చేయాలని పోలీసులకు సూచించింది. కాంగ్రెస్ నేతల నుంచి ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ బెంజ్ కారు లబ్ధి పొందినట్లు బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ గతంలో అసత్యపు ఆరోపణలు చేశారని ఆమె నాంపల్లి కోర్టులో పరువునష్టం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఎంపీ టికెట్ ఆశావహుల్లో ఒకరు దీపాదాస్ మున్షీకి బెంజ్ కారును బహూకరించారని, ఇందుకు సంబంధించి తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని ఆయన ఆరోపణలు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే బీజేపీ నేత తనపై అసత్యపు ఆరోపణలు చేశారని, తన పరువుకు భంగం కలిగించిన ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె నాంపల్లి కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేసిన విషయం కూడా తెలిసిందే.
బైక్‌ను ఢీకొట్టిన కారు
● భార్యాభర్తలకు గాయాలు
● మీనపల్లికలాన్‌లో ఘటన
నవాబుపేట: అతివేగంగా వచ్చిన కారు బైక్ ను ఢీకొట్టడంతో భార్యాభర్తలకు గాయాలయ్యా యి. ఈ ఘటన మీనపల్లికలాన్‌లో చో టుచేసుకుంది. ప్రత్యక్ష్య సాక్షులు, పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి.. మీనపల్లికలాన్‌కు చెందిన చాకలి శ్రీనివాస్ శంకర్‌పల్లిలోని బీడీఎల్ కంపెనీలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిగా, ఇతని భార్య కావేరి శంకర్‌పల్లిలోని అపోలో ఫార్మసీలో పనిచేస్తున్నారు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం బైక్‌పై విధులకు బయల్దేరా రు. గ్రామ శివారులో ఎదురుగా, అతివేగంతో వచ్చిన కారు (టీఎస్13 ఈకే 8297) వీరిని ఢీ కొట్టింది. గాయాలపాలైన దంపతులను సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు హాస్పటల్‌కు తరలించారు. ఇదిలా ఉండగా కారు నడుపుతున్న యజమాని, విశ్రాంత ఆర్మీ ఉద్యోగి గండయ్య కొద్దిదూరం వెళ్లి అక్కడే కారును వదిలేసి వెళ్లిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పుండ్లిక్ తెలిపారు.
పనికి రాలేదని కూలీపై దాడి
పరిగి: పనికి రాలే దని ఓ కూలీని యజమాని కుమారుడు చితకబాదిన ఘటన పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ మోహన్‌కృష్ణ కథనం మేరకు.. చిగురాల్‌పల్లికి చెందిన కాకి మాణిక్యం అదే గ్రామానికి చెందిన మదర్ వద్ద గేదెలు కాసే పనిలో చేరాడు. తల్లి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో రెండు రోజులుగా పనులకు రాలేదు. ఆగ్రహించిన యజమాని కుమారుడు ఫహత్ కర్రలతో మాణిక్యంపై దాడి చేసి గాయపరిచాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేర కు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


