ప్రైవేట్ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలి
ఇబ్రహీంపట్నం: విద్యార్థుల జీవితాలతో శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం చెలగాటమాడుతుందని ఇబ్రహీంపట్నం డివిజన్ ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి ఏర్పుల తరంగ్ ఆరోపించారు. పెట్రోల్ బంక్ పక్కనే స్కూల్ ఉందన కారణంగా విద్యాఽశాఖ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం నర్సరి నుంచి 7వ తరగతి విద్యార్థుల తరగతులు నిర్వహించకుండా సెలవు ఇచ్చారు. వెనుకవైపు ఉన్న మరో బిల్డింగ్‌లో 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలను సందర్శించేందుకు వెళ్లిన ఎస్‌ఎఫ్‌ఐ నేతలతో సిబ్బంది వాదోపవాదాలకు దిగారు. సీజ్ చేసిన పాఠశాల భవనాన్ని ఎలా తెరుస్తారని ఆందోళనకు దిగారు. గేట్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఎంఈఓ హీర్యానాయక్‌ను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు ఎస్‌ఎఫ్‌ఐ నేతలు తెలిపారు. చైతన్య స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు బోడ వంశీ, అజయ్, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.


