
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
● యాజమాన్యం నిర్లక్ష్యమేనని బాధితుల ఆందోళన
● కేఫ్ యజమాని హామీతో సద్దుమణిగిన వివాదం
శంకర్‌పల్లి: కేఫ్‌లో విద్యుత్ మరమత్తులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం మోకిల ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. కేఫ్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందాడని, న్యాయం చేయాలని మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు శంకర్‌పల్లి– హైదరాబాద్ రోడ్డుపై బైఠాయించారు. దీంతో భారీ ఎత్తున ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాజ్‌పేట్ గ్రామానికి చెందిన బద్రి శ్రీనివాస్(42)కి భార్య నాగమణి, కూతుళ్లు గౌతమి, గాయత్రి, కొడుకు సతీష్ ఉన్నారు. ఇక్ఫాయ్ కళాశాల ఎదురుగా ఉన్న కేఫ్– 3లో శ్రీనివాస్ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. శనివారం కేఫ్‌లో విద్యుత్ మరమ్మతులు చేసే సమయంలో ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే శంకర్‌పల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆగ్రహించిన బాధితులు మృతదేహంతో కేఫ్ ఎదుట ఆందోళన చేపట్టారు. చివరికి పోలీసులు, గ్రామస్తుల జోక్యం చేసుకుని యాజమానితో మాట్లాడారు. బాధితుని కుటుంబానికి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో అందోళన విరమించారు. తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకోని, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరబాబు తెలిపారు.