
విద్యార్థులకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కమిటీ సభ్యులు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 26వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలో 22 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, వీరిలో 90 శాతం విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాలలకు దూరంగా నివాసం ఉంటున్నారని, ప్రతీ ప్రభుత్వ, ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న ప్రతీ 30 మందికి ఒక బస్సు ఏర్పాటు చేసి బడికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు లాలయ్య ముదిరాజ్, రాజు ముదిరాజ్, భవాని శేఖర్, రవీందర్ పాల్గొన్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ