
పరిహారం కోసం పట్టు
నిబంధనలు పాటించని.. వచ్చీరాని వైద్యంతో చెలగాటమాడుతున్న ఆర్‌ఎంపీలపై చర్యలు తప్పవని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ఆగ్రహం వ్యక్తం చేశారు.
8లోu
మొయినాబాద్: గోశాల ఏర్పాటుతో భూములు కోల్పోతున్న రైతులు పరిహారం కోసం పట్టుబట్టి కూర్చున్నారు. రాత్రి, పగలు అక్కడే తింటూ, అక్కడే ఉంటున్నారు. గోశాల పనులకు సోమవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య భూమిపూజ చేయడం తెలిసిందే. దీనిపై నిరసన వ్యక్తం చేసిన రైతులు రాత్రంతా అక్కడే భోజనాలు చేసి మంటలు పెట్టుకుని కాపలా కాస్తూ అక్కడే నిద్రపోయారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడి నుంచి కదలలేదు. పరిహారం తేల్చే వరకు పనులు జరగనివ్వమని భీష్మించుకు కూర్చు న్నారు. మరోవైపు పోలీస్ పహారా కొనసాగుతోంది. స్థానిక పోలీసులతోపాటు స్పెషల్ బెటాలియన్ పోలీసులు గస్తీ కాస్తున్నారు. కాగా, భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం ఎకరాకు 300 గజాల చొప్పున పరిహారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ విషయమై చర్చించేందుకు రావాలని రైతులను పిలిచినా వారి నుంచి స్పందన రావడంలేదని తెలుస్తోంది.
రాత్రి, పగలు అక్కడే భోజనం, నిద్ర
భీష్మించుకు కూర్చున్న ఎనికేపల్లి రైతులు