
క్రిష్ ఇన్ హోటల్ కిచెన్‌లో అగ్ని ప్రమాదం
అమీర్‌పేట: ఎస్‌ఆర్‌నగర్ క్రిష్ హోటల్‌లో ఆగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి.దీంతో అప్రమత్తమైన ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చిరు. వివరాల్లోకి వెళితే..ఎస్‌ఆర్‌నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఐదు అంతస్తుల భవనంలో క్రిష్ హోటల్‌తో పాటు గ్రౌండ్ ఫ్లోర్‌లో కాఫీ డే పేరుతో రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు.క్రిష్ హోటల్ కిచెన్‌లో గురువారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయి. దట్టమైన పొగలు రావడంతో హోటల్‌లో పనిచేసే నలుగురు సిబ్బందితో పాటు ఇద్దరు కస్టమర్లు కిందకు దిగే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో వారు భవనం పైకి ఎక్కి ఆర్థనాదాలు చేశారు. మరో యువకుడు హోటల్ కిటికీ పగులగొట్టి కిందకు దూకేందుకు యత్నించగా చేతికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న సనత్‌నగర్ అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి వేశారు. అప్పటికే అక్కడికి వచ్చిన ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది భవనంపై చిక్కుకున్న సిబ్బంది, కస్టమర్లను సురక్షితంగా కిందకు దింపారు. పొగ పీల్చుకుని ఇబ్బంది పడుతునకన ఓ మహిళకు ఆక్సీజన్ అందజేసి వెంటనే 108 ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు ఎస్‌ఆర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు.