బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి
షాబాద్: బీజేపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ముదిరాజ్ భవన్‌లో మండల పార్టీ అధ్యక్షుడు మద్దూరు మాణెయ్య ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడి 11 సంవత్సరాలు ముగిసిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో కమల వికాసమే లక్ష్యంగా పని చేద్దామన్నారు. ఈ నెల 21న యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందామన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు పీసరి సతీశ్‌రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు కిరణ్, రవీందర్‌రెడ్డి, బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి కూతురు మహేందర్, ప్రధాన కార్యదర్శి హరీశ్, బీజేవైఎం మండల అధ్యక్షుడు మహేశ్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మహేందర్, నాయకులు తదితరులు ఉన్నారు.
మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం


