రాజకీయ చైతన్యంతోనే అభివృద్ధి
షాద్‌నగర్‌రూరల్: దళితులు రాజకీయంగా చైతన్యవంతులు అయినప్పుడే అభివృద్ధి సాధ్యమని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రాగల్ల ఉపేందర్ అన్నారు. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని కిషన్‌నగర్‌లో బుధవారం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు నాగభూషణం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ.. దళిత రిజర్వేషన్‌కోసం 31 సంవత్సరాలుగా ఎమ్మార్పీఎస్ అలుపెరగని ఉద్యమం చేసిందని చెప్పారు. దశాబ్దాల ఉద్యమం తరువాత వర్గీకరణ సాధించుకోవడం జరిగిందన్నారు. భవిష్యత్‌లో దళితులంతా ఐకమత్యంతో ఏకతాటిపైకివచ్చి రిజర్వేషన్ వర్గీకరణ ఫలాలను అందుకోవాలన్నారు. జూలై 7న నిర్వహించనున్న జెండావిష్కరణ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రఘువరన్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ, నాయకులు పాండు, కృష్ణ, లింగం, ప్రవీణ్, శ్రీశైలం, బాలు తదితరులు పాల్గొన్నారు.


