
సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధం
కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంఽధీ ఆస్పత్రిలో సర్వం సిద్ధం చేశాం. ఓపీ భవనం రెండో అంతస్తులో 30 పడకలతో కోవిడ్ వార్డు ఏర్పాటు చేశాం. నిష్ణాతులైన వైద్యనిపుణులు అందుబాటులో ఉన్నారు. యాంటివైరల్ డ్రగ్స్, వైరాలజీ ల్యాబ్, రీఏజెంట్స్ (ద్రావకాలు) ఇతర మందులు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. తెలంగాణ ప్రజలు హెర్డ్ ఇమ్యూనిటీ సాధించారు. కరోనా లక్షణాలైన జలుబు, దగ్గు, కీళ్ల నొప్పులు, శ్వాసకోశ ఇబ్బందులు వంటి రుగ్మతలకు గురైనవారు స్వీయ సంరక్షణ పాటిస్తూ, వైద్యుల సలహా మేరకు మందులు వేసుకోవాలి. జన సమూహ ప్రాంతాల్లో మాస్క్ తప్పనిసరిగా ధరించాలి.
– ప్రొఫెసర్ సునీల్‌కుమార్, గాంధీ డిప్యూటీ సూపరింటెండెంట్