
అదుపుతప్పి కారు బోల్తా
మొయినాబాద్: అతివేగంతో వెళ్లిన కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ సంఘటన మొయినాబాద్ మండల పరిధిలోని అమ్డాపూర్ రోడ్డులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం జేబీఐటీ కళాశాల వైపు నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న క్వాలీస్ కారు అతివేగంతో వెళ్తూ అమ్డాపూర్ గ్రామ సమీపంలో మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఆ సమయంలో కారులో డ్రైవర్ ఒక్కరే ఉన్నారు. అతనికి ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
వృక్తి అదృశ్యం
యాచారం: హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. పీఎస్ పరిధిలోని కుర్మిద్ద గ్రామానికి చెందిన మల్కాపురం నర్సింహ(50) ఈ నెల 7న పని కోసం వెళ్తున్నానని చెప్పి ఇంటికి తిరిగి రాలేదు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు చుట్టు పక్కల గ్రామాలు, బంధువుల ఇళ్ల వద్ద వెతికారు. అయినా జాడలేదు. దీంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లిక్కి కృష్ణంరాజు తెలిపారు.
లయన్స్ క్లబ్ సౌజన్యంతో సైకిళ్ల అందజేత
కందుకూరు: లయన్స్ క్లబ్ సౌజన్యంతో దెబ్బడగూడకు చెందిన పేద విద్యార్థినులు సురక్షిత, ప్రవీణకు బుధవారం ఈ–సైకిళ్లు అందజేశారు. లయన్స్ క్లబ్ జి ల్లా వైస్ గవర్నర్ జి.మహేంద్రకుమార్‌రెడ్డి చేతుల మీదుగా బాలికలకు అందించి ఒక్కో సైకిల్ ధర రూ.10 వేలు ఉంటుందని కోశాధికారి కె.వెంకటేశ్వర్లుగుప్తా తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి తాళ్ల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో పాడి ఆవు మృతి
కడ్తాల్: విద్యుదాఘాతంతో పాడి ఆవు మృత్యువాత పడిన సంఘటన మండల పరిధిలోని పుల్లేర్‌బోడ్‌తండాలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. తండాకు చెందిన నేనావత్ గోపాల్‌నాయక్‌కు ఉన్న పాడి ఆవు మేత మేసుకుంటూ పక్క పొలంలోని ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లింది. దీంతో విద్యుత్ తీగకు తగలడంతో అక్కడికక్కడే మృత్యువాత పడినట్లు బాధిత రైతు తెలిపారు. ఆవు విలువ రూ.లక్ష ఉంటుందని, తనను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.

అదుపుతప్పి కారు బోల్తా

అదుపుతప్పి కారు బోల్తా

అదుపుతప్పి కారు బోల్తా