
ఎన్నికల హామీలు నెరవేర్చాలి
తుక్కుగూడ: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి పేర్కొన్నారు. బుధవారం తుక్కుగూడ మున్సిపాలిటీ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రేవంత్ సర్కార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు అనేక ఉచిత హామీలు ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలల గడుస్తున్నా ఇంతవరకు పూర్తిస్థాయిలో హామీలు నెరవేర్చలేదన్నారు. ఆడపిల్లలకు కల్యాణలక్ష్మితో పాటు, తులం బంగారం అందజేస్తామన్నారు. కానీ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎవరికీ బంగారం అందలేదని గుర్తు చేశారు. కేవలం ఎన్నికల సందర్భంగా అడ్డగోలుగా వాగ్దానాలు ప్రకటించారని మండిపడ్డారు. కార్యక్రమంలో తహసీల్దార్ సైదులు, మున్సిపల్ కమిషనర్ వాణి, ఏఎంసీ చైర్మన్ కృష్ణానాయక్, మాజీ కౌన్సిలర్లు, ఆయా పార్టీల నాయకులు, లబ్ధిదారులు, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సబితారెడ్డి
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ