
వృద్ధుల బాధ్యత వారసులదే
మొయినాబాద్‌రూరల్: వయోవృద్ధుల పోషణ, సంక్షేమం చట్టపరంగా వారి పిల్లలే చూసుకోవాలని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మధుసూధనరావు, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని అంజనాదేవి గార్డెన్స్‌లో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సమావేశాన్ని డాక్టర్ వి.పాండుగౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మధుసూదనరావు, అనంతరెడ్డిలు హాజరై మాట్లాడారు. తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం–2007, నియమావళి రూల్స్ 2011ను వివరించారు. డాక్టర్ పాండుగౌడ్ మాట్లాడుతూ.. ఇండియన్స్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా సీనియర్ సిటిజన్స్‌కు ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. అందరం కలిసి పేద కుటుంబాల ప్రజలకు సహాయం అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రతి గ్రామంలో సంఘాలు ఏర్పాటు చేయాలని చట్టం 2007 అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఉపాధ్యక్షులు సత్తయ్య, నాయకులు ఉపేందర్‌రెడ్డి, అనంతరెడ్డి, భాస్కర్, రమేశ్, చంద్రలింగం, సంగరి మల్లేశ్, గోపాల్‌రెడ్డి, మల్లారెడ్డి, కిషన్, రామ్మోహన్, సుగుణాకర్‌రావు, సయ్యాజీరావు, బల్వంత్‌రెడ్డి, కృష్ణారెడ్డి, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మధుసూదనరావు