
లారీని ఢీకొన్న డీసీఎం
ఇరుక్కుపోయి డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
నందిగామ: ముందు వెళ్తున్న లారీని వెనకాల నుంచి డీసీఎం అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని 44వ నంబరు జాతీయ రహదారి(బైపాస్)పై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సీఐ ప్రసాద్ కథ నం ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన షేక్ అన్సార్‌కు చెందిన డీసీఎంపై అదే గ్రా మానికి చెందిన షేక్ జావేద్ డ్రైవర్‌గా పనిచేస్తున్నా డు. సోమవారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్లకు మామిడికాయలను తీసుకెళ్లడానికి డీసీఎం అక్కడి నుంచి బయలు దేరింది. మంగళవారం ఉదయం నందిగామ పరిధిలోని 44వ నంబరు జాతీయ రహదారిపై పెట్రోల్ పంపు సమీపంలో రాగానే డ్రైవర్ జావేద్ డీసీఎంను అతివేగంగా నడిపిస్తూ ముందు వెళ్తున్న తమిళనాడుకు చెందిన లా రీని వెనకాల నుంచి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో డీసీఎం లారీ వెనకభాగంలో ఇరుక్కుపోయి అందు లో జావేద్ చిక్కుకున్నాడు. స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో డీసీఎంను తొలగించి డ్రైవర్‌ను కాపాడారు. అనంతరం క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు లారీ యజమాని షేక్ అన్సార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.