
కలెక్టరేట్‌లో ఏర్పాట్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు జిల్లా సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ హరీశ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉత్సవాలను అన్ని గ్రామాల్లో పండుగలా జరుపుకోవాలని సూచించారు. విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి శుక్రవారం ఉదయం 9 గంటలకు కలెక్టరేట్‌లో జాతీయ పతాకవిష్కరణ చేయనున్నారు. అంతకు ముందు సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఉదయం 7.50 గంటలకు రాచకొండ పోలీస్ కమిషనర్, కలెక్టర్ రాక, 8 గంటలకు అమరవీరులకు శ్రద్ధాంజలి, సమీకృత కలెక్టర్ కార్యాలయం, కొంగరకలాన్‌లో 8.45 గంటలకు కలెక్టర్ హరీశ్ రాక, 8.50 గంటలకు రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్ రాక, 8.55 గంటలకు ముఖ్య అతిథి మంత్రి సబితారెడ్డి రాక, 9 గంటలకు జాతీయ పతాకవిష్కరణ, 9.05 గంటలకు పోలీస్ గౌరవ వందనం, 9.15గంటలకు మంత్రి సందేశం, 9.30 గంటలకు చిన్నారులతో సాంస్కృతిక కార్యక్రమాలు, 10.30 గంటలకు తేనీటి విందు, వందన సమర్పణ ఉంటాయి. ఉత్సవాలకు జిల్లా వ్యాప్తంగా ఆయా మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జాతీయ పతాకవిష్కరణకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
కలెక్టరేట్‌లో పూర్తయిన ఏర్పాట్లు
జాతీయ పతాకావిష్కరణ చేయనున్న మంత్రి సబితారెడ్డి