కలెక్టర్‌తో జలశక్తి అభియాన్‌ కేంద్ర బృందం భేటీ | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌తో జలశక్తి అభియాన్‌ కేంద్ర బృందం భేటీ

Published Fri, Jun 2 2023 3:50 AM

- - Sakshi

ఇబ్రహీంపట్నం రూరల్‌: కేంద్ర జలశక్తి అభియాన్‌ కేంద్ర బృందం సభ్యులు అంకిత్‌ మిశ్రా, డిప్యూటీ సెక్రటరీ అంకిత్‌ విశ్వకర్మ గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ హరీశ్‌తో భేటీ అయ్యారు. జలశక్తి అభియాన్‌ ద్వారా జిల్లాలో చేపట్టిన పనుల గురించి చర్చించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ప్రభాకర్‌ పాల్గొన్నారు.

శతాధిక వృద్ధురాలు

కన్నుమూత

షాబాద్‌: మండల పరిధిలోని నాగర్‌గూడకు చెందిన బేగరి చంద్రమ్మ (110) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. చంద్రమ్మకు ఇద్దరు కుమారులు ఊశయ్య, అనంతయ్య ఉన్నారు. పెద్ద కుమారుడు ఊశయ్య నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అందరితో కలుపుగోలుగా ఉండే చంద్రమ్మ మరణవార్త విని జనం పెద్ద సంఖ్యలో వచ్చి ఆమె మృతదేహం వద్ద నివాళులర్పించారు.

ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల ఫీజు పెంపు

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లోని వివిధ డిగ్రీ కోర్సులకు 30 శాతం ఫీజులు పెంచారు. ఇంతకుముందే పీజీ కోర్సులు, పీహెచ్‌డీ ఫీజులు పెంచిన ఓయూ అధికారులు గురువారం జరిగిన పాలక మండలి సమావేశంలో డిగ్రీ కోర్సుల ఫీజుల పెంపునకు ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ విద్యా సంవత్సరం నుంచి ఫస్టియర్‌ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ తదితర డిగ్రీ కోర్సులకు ప్రభుత్వ కాలేజీల్లో రూ.2 వేలు పెంచగా, ప్రైవేటు కాలేజీలకు రూ.4 వేల వరకు పెంచాలని నిర్ణయించారు. ఓయూలో పదేళ్లుగా ఫీజులు పెంచనందున ఈ విద్యా సంవత్సరం నుంచి ఫీజుల పెంచాలని నిర్ణయం తీసుకున్నటు్‌ల్‌ తెలిసింది. ఓయూ అనుబంధ సికింద్రాబాద్‌ పీజీ కాలేజీ భవనంలోని కొంత భాగాన్ని బాలుర హాస్టల్‌గా మార్చేందుకు పాలక మండలి అనుమతించినట్లు సమాచారం.

రైతులను భాగస్వాములను చేయాలి

జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి

మొయినాబాద్‌: దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించే రైతు దినోత్సవాన్ని పండుగలా జరపాలని జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి అన్నారు. ఈ మేరకు మొయినాబాద్‌లోని రైతు వేదికల్లో జరుగుతున్న ఏర్పాట్లను గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 3న రైతు దినోత్సవం జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. రైతు వేదికలను పచ్చని తోరణాలతో ముస్తాబు చేసి రైతులంతా పాల్గొని వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు. ఆమె వెంట మండల వ్యవసాయాధికారి రాగమ్మ, ఏఈఓ కుమార్‌ ఉన్నారు.

విజయవంతం చేయాలి

మొయినాబాద్‌రూరల్‌: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందామని జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి అన్నారు. మండల పరిధిలోని కనకమామిడి రెవెన్యూ పరిధిలో ఉన్న కేతిరెడ్డిపల్లి వ్యవసాయ రైతు వేదికను గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉత్సవాల్లో భాగంగా రైతు వేదికలను విద్యుత్‌ కాంతులతో అందంగా ముస్తాబు చేయాలన్నారు. రైతులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాగమ్మ, ఏవో కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

రైతు వేదిక వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి
1/2

రైతు వేదిక వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి

బేగరి చంద్రమ్మ (ఫైల్‌)
2/2

బేగరి చంద్రమ్మ (ఫైల్‌)

Advertisement
Advertisement