
నియామక పత్రం అందుకుంటున్న శ్రీనివాస్‌గౌడ్
మంచాల: గౌడ్స్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన నైనంపల్లి శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికయ్యారు. బుధవారం నగరంలో నిర్వహించిన సంఘం విస్తృత స్థాయి సమావేశంలో ఆయన్ను ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు అమరేందర్ గౌడ్ శ్రీనివాస్‌గౌడ్‌కు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను శక్తి వంచన లేకుండా నిర్వహిస్తానన్నారు. రాష్ట్రంలోని గౌడ కులస్తులను ఏకం చేసి వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. గౌడ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడమే కాకుండా వారిని చైతన్య పరుస్తామన్నారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీ ప్రవీణ్‌గౌడ్, సంయుక్త కార్యదర్శి పీ మధుగౌడ్, నాయకులు నరేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.