బీజేపీతోనే ప్రజా సంక్షేమం
● పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ● నూతనంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులకు సన్మానం
సిరిసిల్లటౌన్: ప్రజాసంక్షేమం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని ప్రజలు విశ్వసించారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా గెలుపొందిన బీజేపీ మద్దతుదారులను శుక్రవారం జిల్లా పార్టీ ఆఫీస్‌లో సన్మానించారు. 32 మంది సర్పంచులు, 30 మంది ఉపసర్పంచులు, 200 మంది వార్డు సభ్యులు విజయం సాధించారు. గోపి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అన్ని గ్రామ పంచాయతీల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ దేశాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీపై నమ్మకంతో బీజేపీ అభ్యర్థులను ప్రజలు గెలిపించారన్నారు. పార్టీ జిల్లా ఇన్‌చార్జి గంగిడి మోహన్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేశ్, మేర్గు హనుమంత్‌గౌడ్, పార్లమెంట్ కో–కన్వీనర్ ఆడెపు రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు పొన్నాల తిరుపతిరెడ్డి, సిరికొండ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు, బండ మల్లేశం, బర్కం లక్ష్మి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ పాల్గొన్నారు.


