మేడారం జాతరకు 700 బస్సులు
● ఆర్టీసీ రీజినల్ మేనేజర్ రాజు
కరీంనగర్‌టౌన్: వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర కోసం రీజియన్ పరిధిలోని డిపోల నుంచి 700 బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి.రాజు తెలిపారు. శుక్రవారం బస్‌స్టేషన్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రీజియన్ పరిధిలో గోదావరిఖని, హుస్నాబాద్, హుజూరాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మంథని డిపోల నుంచి జాతర బస్సులు ఉంటాయని తెలిపారు. ఆరు ఆపరేటింగ్ పాయింట్ల వద్ద అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటు, ఎంపిక చేసిన బస్సులకు అవసరమైన మరమ్మతులు, జాతర విధులు నిర్వర్తించే సిబ్బంది ఎంపిక, భక్తుల సురక్షిత ప్రయాణం తదితర అంశాలపై తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో కరీంనగర్ డిప్యూటీ రీజనల్ మేనేజర్లు ఎస్. భూపతి, పి.మల్లేశం, డిపో మేనేజర్లు నాగభూషణం, వెంకన్న, రవీంద్రనాథ్, విజయమాధురి, ఎం.శ్రీనివాస్, శ్రవణ్ కుమార్, కె. కల్పన, ఎస్.మనోహర్, దేవరాజు, ప్రకాశ్‌రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


