గజగజ..పదపదా!
ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎముకలు కొరికే చలిలోనూ బడుగుజీవులు తమ బతుకుపోరాటం చేస్తున్నారు. స్వెట్టర్లు, కూరగాయలు, పాలవ్యాపారులు ఉదయం నుంచే తమ దినచర్యను ప్రారంభిస్తున్నారు. పాలవ్యాపారులు అయితే తెల్లవారుజాము నుంచే తమ వ్యాపారంలో భాగంగా పల్లెల నుంచి సిరిసిల్లకు వచ్చి వీధుల్లో పాలు విక్రయిస్తున్నారు. పలువురు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఉదయం పూట వాకింగ్‌కు వెళ్తున్నారు. ఇలా పలు రకాల వారు చలిని సైతం లెక్కచేయకుండా ముందుకెళ్తున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, రాజన్నసిరిసిల్ల
గజగజ..పదపదా!
గజగజ..పదపదా!


