పనుల్లో నాణ్యత పాటించాలి
● ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ ● ఆలయ విస్తరణ పనులు పరిశీలన
వేములవాడ: ఆలయ విస్తరణ పనుల్లో నాణ్యత పాటించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. రాజన్న ప్రధాన ఆలయ రాజగోపురం నిర్మాణం, ఆలయ విస్తరణ పనులు, బద్ది పోచమ్మ ఆలయం, రాజగోపుర అభివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో గురువారం చర్చించారు. నిర్ణీత కాలంలో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. నిత్య అన్నదానం భవనం, ఇతర అనుబంధ నిర్మాణాలపై పెట్టాలన్నారు. కొత్తగా నిర్మించబడుతున్న భవనాల వద్ద భక్తులకు సరిపడా పార్కింగ్ సౌకర్యం కల్పించాలని సూచించారు. ఇంజినీర్లు కె.రాము, వి.నరసింహాచారి, శ్రీధర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, శాంతయ్య, ఈవో రమాదేవి, ఈఈ రాజేశ్, డీఈలు రఘునందన్, మహిపాల్‌రెడ్డి, ఏఈవోలు బ్రహ్మన్నగారి శ్రీనివాస్, అశోక్ పాల్గొన్నారు.


