డ్రగ్స్ నిర్మూలనలో భాగస్వాములు కావాలి
కోనరావుపేట(వేములవాడ): డ్రగ్స్ నిర్మూలనలో విద్యార్థులు భాగస్వాములు కావాలని వుమెన్ ఎంపవర్‌మెంట్ జిల్లా కోఆర్డినేటర్ రోజా కోరారు. కోనరావుపేటలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో శనివారం ‘నషా ముక్త్ భారత్ అభియాన్, మిషన్ పరివర్తన’ అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదవుతాయన్నారు. తాత్కాలికమైన ఆనందాల వైపు వెళ్లవద్దని కోరారు. బంగారు భవిష్యత్ కోసం ఇప్పటి నుంచే కష్టపడి చదవాలని సూచించారు. డ్రగ్స్ వినియోగించిన, సరఫరా చేస్తున్నట్లు కనిపించిన వెంటనే 1908, అమ్మాయిలను వేధిస్తే 1098కు సమాచారం ఇవ్వాలని కోరారు. జిల్లా కమ్యూనిటీ ఎడ్యుకేటర్ మంద జనార్దన్, కౌన్సిలర్ భార్గవి, కార్యకర్తలు సాయిప్రసన్న పాల్గొన్నారు.


