15న ప్రత్యేక లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

15న ప్రత్యేక లోక్‌ అదాలత్‌

Nov 2 2025 8:13 AM | Updated on Nov 2 2025 8:13 AM

15న ప

15న ప్రత్యేక లోక్‌ అదాలత్‌

సిరిసిల్లకల్చరల్‌: న్యాయస్థానంలో పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కారం కోసం ఈనెల 15న ప్రత్యేక లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, ఇన్‌చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పుష్పలత తెలిపారు. కోర్టు ఆవరణలో శనివారం జరిగిన సమావేశంలో డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి రాధికా జైస్వాల్‌ మాట్లాడారు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో పెండింగ్‌లో ఉన్న చెక్‌బౌన్స్‌ కేసులు, కుటుంబ వివాదాలు, సివిల్‌ తగాదాలు, సంప్రదింపుల ద్వారా తేల్చుకోదగిన కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా న్యాయవాదులు, పోలీస్‌ అధికారులు సహకరించాలని కోరారు. జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.సృజన, సెకండ్‌ అడిషనల్‌ సివిల్‌ జడ్జి గడ్డం మేఘన, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జూపెల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

వృద్ధుల డే కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు కృషి

సిరిసిల్లకల్చరల్‌: వయో వృద్ధుల కోసం జిల్లాలో డే కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు కృషి చేస్తామని జిల్లా సంక్షేమాధికారి పి.లక్ష్మీరాజం తెలిపారు. సిటిజన్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎంపికై న డాక్టర్‌ జనపాల శంకరయ్య, కార్యవర్గ సభ్యుడిగా ఎంపికైన అంకారపు జ్ఞానోభను శనివారం సత్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీడబ్ల్యూవో లక్ష్మీరాజం మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు ఉపకరణాలను అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సంఘం అధ్యక్షుడు చేపూరి బుచ్చయ్య, కోడం నారాయణ, శ్రీగాథ మైసయ్య, గజ్జెల్లి రామచంద్రం, బెజవాడ కై లాసం పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు ఎంపిక

ఇల్లంతకుంట(మానకొండూర్‌): మండలంలోని వల్లంపట్ల హైస్కూల్‌కు చెందిన 8వ తరగతి విద్యార్థులు మంద రిశ్వంత్‌, మల్లమారి అభినయ్‌ రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు ఎంపికైనట్లు హెచ్‌ఎం గోవర్ధన్‌ తెలిపారు. గోదావరిఖనిలో జరిగిన పోటీల్లో అండర్‌ 14 విభాగంలో ప్రతిభ కనబర్చినట్లు చెప్పారు. ఈనెల 3న జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు.

ఎకరాకు రూ.50వేల పరిహారం అందించాలి

సిరిసిల్లఅర్బన్‌: భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50వేలు పరి హారం అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్‌ కోరారు. పట్టణంలోని అమృతలాల్‌ శుక్లా కార్మిక భవనంలో శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారంతోపాటు తడిసిన ధాన్యాన్ని, పత్తిని షరతులు లేకుండా కొనాలని డిమాండ్‌ చేశారు. అధికారులు జిల్లా అంతట సర్వే చేయించి రైతులకు ఎంత నష్టం వాటిల్లిందో అంచనాల ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. సీపీఎం నాయకులు ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, శ్రీధర్‌, పద్మ, రమేశ్‌చంద్ర, కనకయ్య, పోచమల్లు పాల్గొన్నారు.

సమయానికి పూజలు చేయాలి

వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టిన నేపథ్యంలో స్వామికి జరిగే నిత్య కై ంకర్యాలు సకాలంలో నిర్వహించాలని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ కోరారు. కొద్ది రోజులుగా అభివృద్ధి పనుల నేపథ్యంలో స్వామివారికి జరిగే నివేదన, ఇతర పూజలు సక్రమంగా జరగడం లేదని తెలిసిందన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చేస్తే ఊరుకోబోమన్నారు.

15న ప్రత్యేక లోక్‌ అదాలత్‌
1
1/3

15న ప్రత్యేక లోక్‌ అదాలత్‌

15న ప్రత్యేక లోక్‌ అదాలత్‌
2
2/3

15న ప్రత్యేక లోక్‌ అదాలత్‌

15న ప్రత్యేక లోక్‌ అదాలత్‌
3
3/3

15న ప్రత్యేక లోక్‌ అదాలత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement