రహీంఖాన్‌పేట
ఖాకీల కోట..
● ఆ ఊరిలో ఉద్యోగులందరూ పోలీసులే ● ఇరవై ఒక్క మందికి కొలువు ● ఆదర్శంగా నిలుస్తున్న వైనం
అవును.. ఆ ఊళ్లో ఉద్యోగులందరూ పోలీసులే. ఒకప్పుడు ఆ ఊరి నుంచి పీపుల్స్‌వార్, జనశక్తి నక్సలైట్లు కూడా తయారయ్యారు. ఆ సమయంలో పోలీస్ ఉద్యోగంలో చేరాలంటే కుటుంబాల్లో భయం ఉండేది. దానిని అధిగమిస్తూ ఒకరు పోలీస్ ఉద్యోగానికి బాటలు వేసి యువతకు ఆదర్శంగా నిలిచారు.. ప్రస్తుతం 21 మంది పోలీస్‌శాఖలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహీంఖాన్‌పేట పోలీసుల కోటగా మారింది. – ఇల్లంతకుంట(మానకొండూర్)
ఇద్దరు కొడుకులు పోలీసులు
ముగ్గురు కొడుకుల్లో ఇద్దరికీ పోలీస్ కొలువులు వచ్చాయి. పెద్ద కొడుకు వ్యవసాయం చేసుకుంటాడు. పిల్లలు ఇద్దరికీ ఉద్యోగాలు రావడంతో కుటుంబం ఆర్థికంగా ఎదిగింది. చాలా సంతోషంగా ఉంది.
– బిళ్లవేని సత్తవ్వ, రహీంఖాన్‌పేట
రహీంఖాన్‌పేట
రహీంఖాన్‌పేట


