తంగళ్లపల్లి(సిరిసిల్ల): అకాల వర్షాలతో రామచంద్రాపూర్ శివారు బానప్ప చెరువు కట్టతెగి 50 ఎకరాల్లోని పొలాలు నీట మునిగాయని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు. ఈమేరకు శుక్రవారం రైల్వేకట్టపై ధర్నాకు దిగారు. పొన్నాల చక్రపాణి, సురేశ్, బొడ్డు శ్రీధర్, గడ్డం భాస్కర్‌రెడ్డి, గంధం శ్రీనివాస్, రమేశ్, సందీప్, కొమ్ము పరుశరాములు, సు జాత, బాలయ్య, ఎల్లయ్య, చంద్రయ్య, బాలమల్లు, మహేశ్ పాల్గొన్నారు.
ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి
కోనరావుపేట(వేములవాడ): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలని డిప్యూటీ సీఈవో మచ్చ గీత అన్నారు. మండల పరిషత్‌లో శుక్రవారం ప్రత్యేకాధికారులు, గ్రామ కార్యదర్శులతో సమీక్షించారు. కోనరావుపేట మండలంలో 562 ఇళ్లు మంజూరుకాగా.. 448 ఇళ్లకు మార్కింగ్ ఇస్తే.. 351 బేస్‌మెంట్ లెవెల్, 212 రూఫ్, 112 స్లాబ్ లెవెల్‌కు, మూడు ఇళ్లు పూర్తయినట్లు తెలిపారు. హౌసింగ్ ఏఈ రాజశేఖర్, ఎంపీడీవో స్నిగ్ధ, సూపరింటెండెంట్ శంకర్‌రెడ్డి, ఎంపీవో అరిఫ్‌పాషా పాల్గొన్నారు.
కార్మికుల సమస్యలపై పోరాడుతాం
సిరిసిల్లటౌన్: కార్మికుల అభ్యున్నతికి ఏఐటీయూసీ పోరాడుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్ పేర్కొన్నారు. కార్మిక భవన్‌లో శుక్రవారం నిర్వహించిన 106వ ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 44 కార్మికచట్టాలను యథాతథంగా ఉంచాలని కోరారు. నాయకులు అజ్జ వేణు, కడారి రాములు, నల్ల చంద్రమౌళి, మ్యాన సిద్దమ్మ, అనసూర్య, సుంకణపెల్లి శాంతా, కొండ ఈశ్వరీ, దుండ్రపెల్లి రవీందర్, తాళ్లపెల్లి రామయ్య పాల్గొన్నారు.
ఎల్‌ఎండీకి నీటి విడుదల
బోయినపల్లి(చొప్పదండి): మిడ్‌మానేరు నుంచి ఎల్‌ఎండీకి శుక్రవారం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులోకి మూల, మానేరువాగుల్లో నుంచి 3వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 26.888 టీఎంసీల నీరు ఉంది.
గురుకులాల్లో మిగిలిన సీట్లకు 4న కౌన్సెలింగ్
సిరిసిల్లకల్చరల్: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు ఈనెల 4న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఆ సంస్థల జిల్లా సమన్వయకర్త జేజే థెరీస్సా శుక్రవారం ప్రకటనలో తెలిపారు. 5 నుంచి 9వ తరగతి వరకు ప్రస్తుత విద్యాసంవత్సరంలో మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత గల విద్యార్థులు, తల్లిదండ్రులు 4వ తేదీ ఉదయం 10 గంటలకు చిన్న బోనాలలోని గురుకుల విద్యాసంస్థలో హాజరుకావాలని సూచించారు.
పరిహారం చెల్లించండి
పరిహారం చెల్లించండి
పరిహారం చెల్లించండి


