వడ్లు తడవాల్సిందేనా?!
తడిసిన వడ్లను చూపుతున్న ఇతను ముస్తాబాద్ మండలం పోత్గల్‌కు చెందిన కిషన్. మూడెకరాలు కౌలుకు తీసుకుని వరి వేశాడు. పది రోజుల కిందట పంటను కోసి పోత్గల్ ఐకేపీ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. వర్షాలు పడతాయన్న హెచ్చరికల నేపథ్యంలో మూడు పరదాలు(కవర్లు) అద్దెకు తెచ్చి వడ్ల రాసులపై కప్పాడు. ఇప్పటికే కవర్ల అద్దెకు రూ.2వేలు చెల్లించాడు. భారీ వర్షంతో వడ్లు తడిశాయి. టార్పాలిన్ ఉంటే తడిసేవి కాదని రైతు వాపోయాడు.
తడిసిన ధాన్యాన్ని ఆరబెడుతున్న ఈ రైతు దంపతులు కట్టకింది రాజు, లత. వీరిది కోనరావుపేట మండలం నిమ్మపల్లి. వరి పంటను కోసి గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో ఆరబెట్టారు. టార్పాలిన్లు లేక.. పాతచీరలతో కుట్టించిన బట్టలో ఆరబోసి, కుప్పలపై వాటినే కప్పారు. బుధవారం నాటి భారీ వర్షానికి వడ్లు తడిసిపోయాయి. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు ఇలా కష్టపడుతున్నారు.
వడ్లు తడవాల్సిందేనా?!


