ఇందిర సేవలు చిరస్మరణీయం
● టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్
సిరిసిల్లటౌన్: దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేదల అభ్యున్నతికి చేసిన సేవలు చిరస్మరణీయమని టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్ కొనియాడారు. సిరిసిల్ల చౌక్‌లో శుక్రవారం కాంగ్రెస్ పట్టణశాఖ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ వర్ధంతి నిర్వహించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ ఎన్నో సంస్కరణలు చేపట్టారన్నారు. అభివృద్ధి చెందిన దేశాల సరసన భారతదేశాన్ని నిలిపారన్నారు. నాయకులు గోలి వెంకటరమణ, దుబాల వెంకటేశం, అన్నల్‌దాస్ భాను, గుజ్జె రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


